మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా త్వరలోనే శంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలు కానుంది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఆయన బ్యానర్ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యే ఆలోచన లేదని చెబుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ 80 కోట్ల రూపాయల రెమ్యురేషన్ డిమాండ్ చేశాడట.

అయినా కూడా మేకర్స్ ఏ మాత్రం భయపడకుండా రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం 250 కోట్ల మేరకు బడ్జెట్ కేటాయించారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ కథలో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రం ప్రారంభానికి ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది.  ఏదేమైనా 80 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.

అందులోనూ రామ్ చరణ్ తొలిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాంటి సమయంలోనే ఆయన 80 కోట్లు పారితోషకం తీసుకోవడం ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురి చేస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ తో కలిసి ఆయన చేసిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. తండ్రి చిరంజీవితో కలిసి ఆయన నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4న విడుదల అవుతుంది. ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి చరణ్ నటించిన రెండు సినిమాలు నెల రోజుల వ్యవధిలోనే విడుదల అవుతూ ఉండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: