మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రక్రియ ఎంత రసవత్తరంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసినప్పటికీ ఈ ఎన్నికల చర్చ మాత్రం ఇంకా తగ్గ లేదు అని చెప్పవచ్చు. ప్రకాష్ రాజు ప్యానెల్ నుండి గెలిచిన సభ్యులు రాజీనామా చేయడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఎన్నికలలో గెలిచిన మంచు విష్ణు మూకుమ్మడి రాజీనామాల పై ఎలా స్పందిస్తాడా, అని అందరూ చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్న సమయం లో, మంచు విష్ణు మాత్రం తన పని ని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. నిన్న అధ్యక్ష పదవి కి ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు వెంటనే పెన్షన్ ఫైల్ పై సంతకం చేశాడు. ఇలా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు ఇవాళ తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ను కలిశాడు. ఈ సందర్భం గా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై బాలయ్య తో చర్చించినట్లు తెలుస్తుంది.

మా’  అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం అనంతరం మంచు విష్ణు మొదట గా బాలకృష్ణ కలవడం చర్చనీయాంశంగా మారింది. బాలయ్య ను కలిసిన అనంతరం మంచు విష్ణు మీడియా తో మాట్లాడుతూ..
బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్లుగా మంచు విష్ణు స్పష్టం చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ని కూడా కలుస్తానని మంచు విష్ణు తెలియజేశాడు. ఈ నెల 16 న ఎన్నికల అధికారి తన ప్యానల్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని విష్ణు తెలిపాడు. ఇక రాజీనామాలపై ఈసీ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మంచు విష్ణు తెలియజేశాడు. ఆ తర్వాత మోహన్ బాబు మీడియా తో మాట్లాడుతూ.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విష్ణు కు బాలకృష్ణ అండగా నిలిచారు అని విష్ణు , బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నట్లుగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: