మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రకాష్ కీలక అంశాలు ప్రస్తావించారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఎన్నో సంఘటనలకు మీరే సాక్ష్యం గా ఉన్నారని ఉన్నారని పేర్కొన్నారు. డిఆర్సి మెంబర్ గా ఉన్న మోహన్ బాబు, మాజీ మా ప్రెసిడెంట్ నరేష్ ల అసాంఘిక ప్రవర్తనను మీరు చూశారు అని అన్నారు. వాళ్ళిద్దరు మా సభ్యులపై దాడి చేశారని ప్రకాష్ రాజ్ లేఖలో ఆరోపించారు. మా ఎన్నికల పోలింగ్ సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే టీవీలో ప్రసారమయ్యాయని పేర్కొన్నారు. ఇక కొన్ని వీడియోలు నవ్వు వచ్చే విధంగా ఉన్నాయని... కొంతమంది పరిచయస్తుల ప్రవర్తన అసహ్యంగా ఉంది అని ప్రకాష్ పేర్కొన్నారు. మా లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారని ప్రకాష్ రాజు పేర్కొన్నారు.

మా ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీసీ కెమెరాలను వినియోగించారని ఈ విషయాన్ని మీరే చెప్పారని... ప్రతి ఒక్క అంశాన్ని ఆ కెమెరాల్లో కచ్చితంగా రికార్డు చేశారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ సీసీ కెమెరా రికార్డు వీడియోలను తనకు అప్పగించాలని ప్రకాష్ రాజ్ కోరారు. పోలింగ్ కు సంబంధించిన వీడియో రికార్డులను పొందడం తమ హక్కు అని ప్రకాష్ డిమాండ్ చేశారు.

పోలింగ్ కు సంబంధించిన వీడియోలను కనీసం మూడు నెలల వరకు భద్రపరుచుకోవలసిన బాధ్యత పోలింగ్ అధికారి గా మీకు ఉంటుందని ప్రకాష్ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా గతంలో ఎన్నికలు నిర్వహించిన తర్వాత పోలింగ్ కు సంబంధించిన వీడియోలను మూడు నెలల పాటు డిలీట్ చేయకుండా ఉంచాలని పేర్కొన్నారని అన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా సీసీ టీవీ ఫుటేజ్ ను ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. లేఖ పై మీరు వెంటనే స్పందించి ఫుటేజ్ ఇవ్వకపోయినా...డిలీట్ అయిందని చెప్పినా.... గోల్ మాల్ జరిగిందని తను భావిస్తానని ప్రకాష్ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సిసి టివి ఫుటేజ్ లు తనకు కావాలని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: