అక్కినేని నాగార్జున హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు దాటింది. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాల ద్వారా తెలుగులో రికార్డుల మీద రికార్డులు సృష్టించగా ఏ హీరో కూడా టాలీవుడ్ లో నమోదు చేయని ఓ రికార్డును తన పేరిట సొంతం చేసుకున్నాడు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ హిందీ సినిమాలు చేసిన హీరో గా రికార్డును సృష్టించాడు నాగార్జున. మరి ఆయన నటించిన బాలీవుడ్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
అక్కినేని నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన శివ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ రాగా అక్కడ కూడా అదే స్థాయిలో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హిందీలో అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఖుదాగవా అనే చిత్రంలో ముఖ్య పాత్రలో నటించగా అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అంతం మూవీ బాలీవుడ్ లో ద్రోహి అనే పేరుతో విడుదల చేయగా అది కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన క్రిమినల్ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలై సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
మహేష్ భట్ దర్శకత్వంలో అంగారే అనే చిత్రంలో నటించాడు నాగార్జున. ఈ చిత్రంలో అనిల్ కపూర్ మరియు శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే మహేష్ భట్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించాడు మహేష్. నాగార్జున ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేయగా అక్షయ్ కుమార్ కూడా మరో కథానాయకుడు గా నటించడం విశేషం. మూడో సారి మహేష్ భట్ దర్శకత్వంలో నకమ్ అనే సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించాడు. ఇంకా నాగార్జున అగ్ని వర్ష అనే హిందీ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించాడు. Loc కార్గిల్ అనే మూవీ లో కూడా ఓ ముఖ్యమైన పాత్రలో మెరిసారు. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు.