టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ సంగీత దర్శకుడు ఎవరు అంటే తప్పకుండా తమన్ పేరునే మెజారిటీ ప్రేక్షకులు చెబుతారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన అందిస్తున్న సంగీతం సమకూరుస్తున్న నేపథ్య సంగీతం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమా కి పాటలు అందించినా ఆ సినిమాలోని అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయి తనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా సినిమాకి కూడా భారీ క్రేజ్ పెడుతుంది.
సినిమాల సక్సెస్ లో తమన్ ఎంత ఉందో ఇటీవలే వచ్చిన సినిమా లే ఉదాహరణ. అలా ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని అందుకోవడం టాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ గా మారింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం తమన్ చేతిలో పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఉన్నాయి. ఎవరి అభిమానులను బట్టి వారిని మైమరిపిస్తూ అందరు హీరోలకు వారి వారి రేంజ్ లో సంగీతాన్ని సమకూరుస్తున్న తమన్ భవిష్యత్తులో ఇంకా గొప్ప గొప్ప సంగీత దర్శకులుగా ఎదుగుతున్నారు. అయితే తాజాగా ఓ సినిమా విషయంలో తమన్ అందించిన మ్యూజిక్ పై చిత్ర బృందం సంతృప్తిగా లేదట.
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు ఉండగా ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలు పోటీగా రావడంతో ఆ డేట్ మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా డిసెంబర్ మూడవ వారంలో ఈ సినిమాను పూర్తి చేయాలని యూనిట్ టార్గెట్ సెట్ చేసుకోగా ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఏ మాత్రం సంతృప్తిగా లేడట పరశురామ్. ఇదివరకే 5 ట్యూన్స్ రెడీ చేసిన తమన్ రెండు మాస్ సాంగ్స్ ను కూడా ఓకే చేసుకోగా మిగితా 3సాంగ్స్ విషయంలో పరశురామ్ అంత సంతృప్తిగా లేడని తెలుస్తుంది. మరి దర్శకుడిని తమన్ ఏ విధంగా సంతృప్తి పరుస్తాడో చూడాలి.