ఇండియన్ 2మూవీపై ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ప్రేక్షకుల్లో రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఆ సినిమా ఏమైంది..? భారతీయుడు మూవీని మించిపోతుందా..? పాటలు అప్పటి రికార్డ్ ను చెరిపేస్తాయా..? అప్పటి కమల్ హాసన్ ను ఇప్పటి కమల్ హాసన్ కు వచ్చి మార్పులేంటి..? ఇలా రకరకాల ప్రశ్నలు ఆడియన్స్ మైండ్ లో తిరుగుతున్నాయి. అయితే శంకర్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇదే ప్రేక్షకులను అయోమయంలో పడేసింది.

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. 'ఇండియన్2' ఆగిపోలేదు మళ్లీ మొదలుపెడతాం, శంకర్‌తో మాట్లాడి అన్నీ సెట్‌ చేసుకుంటాం అన్నాడు. అయితే ఈ హీరో ఇలా చెప్పాడో లేదో, శంకర్‌ అలా పాన్‌ ఇండియన్ మూవీ స్టార్ట్ చేశాడు. దీంతో 'ఇండియన్2'పై మళ్లీ సందేహాల్లో పడిపోయింది. 'ఇండియన్2' సెట్స్‌కి వెళ్లినప్పటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సెట్స్‌లో క్రేన్‌ వర్కర్స్‌ కిందపడి చనిపోయినప్పుడు కొన్నాళ్లు షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత బడ్జెట్‌ విషయంలో గొడవలు జరిగి 'ఇండియన్2'కి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈలోపు కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి షూటింగ్‌ మొత్తానికే ఆగిపోయింది.

'ఇండియన్2' ఆగిపోయాక శంకర్‌ రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. రామ్‌ చరణ్‌తో ఒక సినిమా, రణ్‌వీర్‌ సింగ్‌తో 'అన్నియన్' రీమేక్‌ ప్రకటించాడు. ఈ లోపు లైకా ప్రొడక్షన్స్‌ కోర్టుకి వెళ్లింది. బయటే తేల్చుకోవాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో 'ఇండియన్2' పక్కనపెట్టేసి రామ్‌ చరణ్‌ సినిమా కూడా లాంచ్ చేశాడు. కమల్ హాసన్ ఇటీవలే 'ఇండియన్2' ఆగిపోలేదు, మళ్లీ స్టార్ట్ చేస్తాం అని చెప్పాడు. శంకర్‌తో డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.. త్వరలోనే సెట్స్‌కి వెళ్తాం అని కూడా చెప్పాడు. కానీ శంకర్, చరణ్‌ సినిమాతో బిజీ అయ్యాడు. దీంతో మళ్లీ 'ఇండియన్‌2' ఆగిపోయిందనే టాక్ స్టార్ట్ అయింది. మరి ఈ మూవీపై శంకర్‌ ఎప్పటికి క్లారిటీ ఇస్తాడో చూడాలి.  

మొత్తానికి విలక్షణ నటుడు కమల్ హాసన్ మూవీపై సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి. శంకర్ ఎప్పుడు నోరు విప్పుతాడోనని అంతా వెయిట్ చేస్తున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: