చిరంజీవి ఒక మగాడు అంటూ ఆయన కీర్తిని మెచ్చుకున్నారు నటుడు బాబు మోహన్. ఇక ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక వివరాల్లోకి వెళితే, అప్పుడు, ఎప్పుడూ ఎవర్ గ్రీన్ నటుడిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు మెగా స్టార్ చిరంజీవి అని అందరికి తెలుసు.
చాలా మంది ఆయన నటన చాతుర్యానికి ఫ్యాన్స్ అయితే ఎంతో మందికి ఆయన డాన్స్ ను ఆదర్శంగా తీసుకుంటారనీ తెలుస్తుంది.. అప్పటి హీరోలలో ఆయన వేసిన స్టెప్పులు మరే హీరో కూడా వేయలేరు అనే పేరును కూడా మూటగట్టుకున్నారట చిరంజీవి. అప్పటి హీరోయిన్లతో పాటు వర్ధమాన నటీ మనులతోనూ పోటీ గా నటిస్తూ కూడా వారికంటే అందంగా డాన్స్ లు చేస్తూ ఇప్పటికీ కుర్రకారును ఉర్రూతలగిస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ప్రముఖ నటుడు మరియు కమెడియన్ బాబు మోహన్ కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారనీ తెలుస్తుంది.. ఆయన డాన్స్ చేస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయే వాడినని అలాగే ఒక స్ప్రింగ్ లాగా ఆయన వంకలు తిరుగుతూ డాన్స్ చేయడం నిజంగా అద్భుతం అని బాబు మోహన్ తెలిపారనీ సమాచారం.
అంతే కాకుండా ఆయన డ్యాన్స్ చేస్తుంటే కళ్లు ఆకాశమంత చేసుకొని అలా చూస్తానని ఆయన తెలిపారట.. అప్పటి హీరోయిన్లు రాధ మరియు భానుప్రియ అలాగే విజయ శాంతి లాంటి వాళ్లతో పోటీగా చిరంజీవి నటనే కాకుండా డ్యాన్స్‌లోనూ అత్యంత ప్రతిభను కనబరుస్తారని ఆయన అన్నారనీ సమాచారం.. చిరంజీవి డ్యాన్స్‌లకు తానెప్పుడూ అభిమానినే అంటూ ఆయన గర్వంగా చెప్పారట బాబూమోహన్ . ఆయనలాగా లేడీస్ కూడా చేయలేరని వాళ్లు కూడా కొన్నిసార్లు నిలబడే చేశారని బాబు మోహన్ చెప్పారనీ తెలుస్తుంది . ఆయన బాడీ ఒక స్ప్రింగ్‌లాగా కదులుతుందని ఆయన తెలిపారట.. ఇప్పుడున్న వాళ్లు అలా చేయరనీ కాదనీ అందరూ బాగా చేస్తారని అలాగే ఇప్పుడున్న వాళ్లు కూడా చాలా బాగా డ్యాన్స్‌లు చేస్తున్నారని బాబు మోహన్ అన్నారట.. కానీ చిరంజీవి డ్యాన్స్ చేస్తుంటే మాత్రం నిజమైన మగాడు చేస్తున్నాడ్రా బుజ్జి డ్యాన్స్ .. అని తనకు అనిపిస్తుంటుందని ఆయన స్పష్టం చేశారనీ తెలుస్తుంది.