బోయపాటి శీను గురించి టాలీవుడ్ లో ఎవరిడిగా చెబుతారు. ఆయన మాస్ డైరెక్టర్ అనీ.. తిరుగులేని డైరెక్టర్ అని. విజిల్స్ వేస్తే టాటా సుమోలు లేవడం.. తొడలు కొడితే బాంబులు పేలడం లాంటివి ఎక్కువగా ఈ దర్శకుడి సినిమాల్లోనే కనిపిస్తాయి. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన సినిమాలన్నీ ఈయన తీసినవే. ముఖ్యంగా నందమూరి నట సింహం బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలు తీశాడు ఈ డైరెక్టర్. అలాంటి దర్శకుడికి ఒక సమస్య వచ్చి పడింది. ఆయన తీయబోయే కొత్త సినిమాకు హీరో కోసం వెతుకులాట ప్రారంభించారని తెలుస్తోంది.

సరైన ప్రొడ్యూసర్ దొరికితే చాలు పేపర్ మీదున్న కథ.. దర్శకుడి ద్వారా తెరపైకి వెళ్తుంది అంటారు. కానీ బోయపాటి శీనుకి భారీ నిర్మాత దొరికాడు కానీ.. హీరో దొరకడం లేదు. దీంతో బోయపాటి తమిళ్, కన్నడ ఇండస్ట్రీస్‌ వైపు చూస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. బోయపాటి శీను తాజా మూవీ 'అఖండ' విడుదలకు సిద్దం అయింది.  ఇక 'అన్‌స్టాపబుల్' టాక్‌షో ఈవెంట్‌లో తర్వాత బోయపాటితో ఒక సినిమా తీస్తామని చెప్పాడు అల్లు అరవింద్. ఇక ఈ మూవీలో బన్నీ హీరోగా చేస్తాడనీ.. 'సరైనోడు' కాంబో రిపీట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే బోయపాటి సినిమాలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.  

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్‌తో 'ఐకాన్' చేయబోతున్నాడు  బన్నీ.  అలాగే కొరటాల శివతోనూ ఒక సినిమాకి సంతకం పెట్టేశాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ పూర్తి కావడానికి రెండు మూడేళ్లు పట్టే అవకాశముంది. మరి అప్పటి వరకు బోయపాటి శ్రీను వెయిట్‌ చేస్తాడా లేకపోతే మరో హీరోతో సినిమా చేస్తాడా అనేది  ఆసక్తికరంగా మారుతోంది.

'కెజిఎఫ్'తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన కన్నడ స్టార్ యశ్‌తో బోయపాటి శ్రీను ఒక సినిమా చేస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తమిళ హీరో సూర్య కోసం కథ రాస్తున్నాడనే టాక్ కూడా వచ్చింది. వీళ్లిద్దరికీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది కాబట్టి వీళ్లలో ఎవరితో సినిమా చేసినా మార్కెట్‌ అవుతుంది. అందుకే బోయపాటి ఈ స్టార్స్‌కి కూడా కథలు రాస్తున్నాడనే టాక్ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: