కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం ఒక పెద్ద సంచలనం అని చెప్పాలి. కోటాను కోట్ల డబ్బు దాని మించిన క్రేజ్, పేరు అన్ని ఉన్నా కూడా ఇప్పుడు ఆయన పొలిటికల్ లోకి ఎంట్రీ ఇచ్చి అవమానాలు పడాల్సిన అవసరం ఏముందని ఎంతోమంది సలహాలు ఇస్తున్న కూడా ప్రజలకు నాణ్యమైన సేవ విశేషమైన సేవ అందించాలనే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన దారుణంగా ఉంది సినిమా వారిపై వారి చూపు హీనంగా ఉంది అని ఇటీవల రిపబ్లిక్ సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. సినిమాలలో ఏ రేంజ్ లో అయితే ఆయనకు ఫాలోయింగ్ ఉందో బయట కూడా పొలిటికల్ గా ఆయనకు అదే రేంజ్లో ఫాలో యింగ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన 2019 వ సంవత్సరం ఎన్నికల లో పాల్గొన్న తరువాత వచ్చిన ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. కనీసం సొంత సీటును కూడా గెలవలేక పోయిన పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క సీటు అసెంబ్లీ సీట్లు గెలిచి చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు బయటపడి పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి పొలిటికల్ కెరియర్ లోనే అంతం అవుతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ ఆ రిజల్ట్ కు ఏ మాత్రం భయపడకుండా బాధపడకుండా వెనక్కి తగ్గకుండా పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న రేంజ్లో ఇప్పటికీ రాజకీయాలలో కొనసాగుతున్నాడు. మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ రాజకీయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అయ్యే విధంగా ముందుకు దూసుకు వెళుతున్నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: