ఎంతో చారిత్రాత్మక ఉన్న సరిహద్దు ప్రదేశానికి బైకు మీద వెళ్ళడం అంటే అది చాలా పెద్ద విషయం అని అభిమానులు తెలియజేస్తున్నారు. అజిత్ కొద్ది రోజుల క్రితం చెన్నై నుండి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేశంలోని ప్రముఖ పట్టణాలు, ప్రదేశాలను చూస్తూ బైక్ రైడింగ్ ను కొనసాగిస్తున్నాడు. అలాగే తాజ్ మహల్ ను కూడా సందర్శించినట్లు గా తెలుస్తోంది. అలా ఉత్తర భారతదేశంలోని కొన్ని మంచి ప్రదేశాలను కూడా కవర్ చేశాడు అజిత్.
ఇక ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను చూడడం తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నాడు. అది కూడా బైక్ రైడింగ్ వెళ్లడంతో తనకు ఇంకా సంతోషం వేసిందని తెలియజేశాడు. ఇక చివరిగా సరిహద్దు వద్దకు వెళ్లి అక్కడి నుండి అజిత్ ఇంటికి ప్రయాణం కాబోతున్నట్లు గా తెలుస్తోంది. మరొక వారం రోజుల్లో అజిత్ ఇంటికి వస్తాడు అన్నట్లుగా తన సన్నిహితులు తెలియజేస్తున్నారు.
ఇక తాజాగా అజిత్ నటిస్తున్న వాలిమై సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి మాసం లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలు మరొక యంగ్ హీరో కూడా విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక వీరిద్దరి కలిసి దిగినటువంటి ఫోటో లు కూడా ఈ మధ్య కాలంలో భాగం వైరల్గా మారాయి.