ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ తో పాటు ఇంట్రో టీజర్లు రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. థమన్ స్వరపర్చిన టైటిల్ సాంగ్ తో పాటు మరో పాటకు కూడా మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా ఓటీ టీ రిలీజ్ చేస్తే అదిరిపోయే రేటు ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ రెడీగా ఉందని టాక్ వినిపిస్తోంది.
థియేటర్ రిలీజ్ కాకుండా.. ఓటీ టీకి ఇస్తే రు. 150 కోట్లు ఇస్తామని అమోజాన్ ఆఫర్ చేసినట్టు టాక్ ? ఈ సినిమా ను థియేటర్ల లో రిలీజ్ చేస్తే హిట్ టాక్ వస్తే రు. 100 కోట్ల షేర్ సులువుగా వసూలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా రు. 150 కోట్ల ఓటీ టీ ఆఫర్ వచ్చిందన్న వార్తలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సంక్రాంతికే థియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వస్తుంది.
మరి ఈ సినిమా కు పోటీ గా భీమ్లా నాయక్ ను రిలీజ్ చేస్తున్నారు. మరి భీమ్లా నాయక్ మేకర్స్ డేట్ మారుస్తారా ? లేదా ఓటీటీకి వెళతారా ? అన్నది చూడాలి. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.