1982 మార్చి నెలలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అప్పట్లో కేంద్రంలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుంది. ఇక వరుసగా ముఖ్యమంత్రులను మారుస్తూ అభివృద్ధి చేస్తుంది. ఇలాంటి సమయంలో కొత్తవారి కోసం తెలుగు ప్రజలందర్నీ ఎదురు చూస్తున్న వేళ తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారకరామారావు. ఇక పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల సమయం లోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో మహా మహా రాజకీయ ఉద్దండులు ఉంటే అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి బుడిబుడి అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ గెలవడం మాత్రం అసాధ్యం అని అనుకున్నారు అందరు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే తిరుగులేని మెజారిటీ సాధించి విజయం సాధించారు.
ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు నందమూరి తారక రామారావు. ఇక ఒక్క ఎన్నికల్లోనే ఎన్టివోడి దెబ్బకు అటు కాంగ్రెస్ కంచుకోటలు బద్దలు అయిపోయాయి అని చెప్పాలి. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని అంతటి విజయాన్ని అసలు కాంగ్రెస్ కలలో కూడా ఊహించలేదు. రాజకీయ ఉద్దండులు కాదు రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలనుకుంటున్న యువరక్తానికి టికెట్లు ఇచ్చి వారిని గెలిపించకున్నాడు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే భారీ మెజారిటీ సాధించి కేంద్రంలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ పార్టీని సైతం ఓడించిన ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు అని చెప్పాలి. ఇలా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనకు తిరుగు లేదు అని నిరూపించారు.