కరీనా కపూర్ పిల్లల పేర్ల విషయంలోనూ ట్రోలింగ్ జరిగింది. పెద్దకొడుక్కి తైముర్ అని పేరు పెడితే ఆక్రమణదారు టర్కిష్ రాజు పేరు పెడతారా అని విమర్శించారు. ఇక రెండో కొడుక్కి జహంగీర్ అని పేరు పెడితే భారతదేశాన్ని ఆక్రమించిన మొఘలుల వారసుల పేరు పెడతారా అని కరీనాని ట్రోల్ చేశారు. అలౌకిక్ దేశాయ్ రామాయణ గాథ ఆధారంగా 'సీత' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా కోసం కరీనా కపూర్‌ని సంప్రదిస్తే 12 కోట్లు అడిగిందనే టాక్ వచ్చింది. దీంతో 'సీత' పాత్రకి కరీనా ఏంటి.. ముస్లిమ్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌తో పురాణ గాథ తీస్తారా అని విమర్శించారు. అలౌకిక్ దేశాయ్‌ని కూడా ట్రోల్ చేశారు. దాంతో మేం కరీనాని తీసుకోట్లేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ గొడవ నుంచి బయటపడ్డారు.
కరీనా కపూర్‌ని ప్రతీ ఇన్సిడెంట్‌లో విమర్శించడంతో ఒక సెక్షన్ ఈమెని టార్గెట్ చేసిందనే మాటలు మొదలయ్యాయి. పైగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాక బాలీవుడ్‌లో నెపోటిజం, గ్రూపుల గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో ఒక సెక్షన్ కపూర్ కాందాన్‌ని టార్గెట్ చేసిందని అందుకే కరీనాని విమర్శిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు ఆమె అభిమానులు. మరి ముందు ముందు ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.