ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు పోస్టర్స్ అన్ని కూడా సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు పరశురామ్ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తీస్తున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, కేవలం సాంగ్ మాత్రమే కాక, ఇందులో విలన్ గా నటిస్తున్న సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా పండుగ రోజున విడుదల చేసేలా యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం .మరి ఇదే కనుక నిజం అయితే సంబరాల దీపావళి పండుగ నాడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఏకంగా డబుల్ ఫీస్ట్ ఖాయం అనే చెప్పాలి. కాగా ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు ఆర్ధిక నేరాల నేపథ్యంలో సాగనుండగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.