ఓవరాల్ గా రిపబ్లిక్ సినిమాకు మంచి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా రిపబ్లిక్ నిలిచింది. ఈ సినిమా కు అమ్మిన రేట్లలో సగం కూడా రికవరీ కాలేదు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను వరల్డ్ వైడ్ గా రు. 12 కోట్లకు అమ్మారు. అక్టోబర్ 1న రిలీజ్ అయిన రిపబ్లిక్ 10 రోజులకు గాను రు. 6 కోట్ల షేర్ రాబట్టింది. ఆ తర్వాత ఈ సినిమా ను జనాలు పట్టించు కోలేదు.
ఇక ఇప్పుడు ఫైనల్ గా బాక్సాఫీస్ రన్ ముగిసింది. థియేట్రికల్ బిజినెస్ లో దాదాపు 5 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నా యి . పవన్ - చిరంజీవి తో పాటు పలువురు ఇండస్ట్రీ వాళ్లు రిపబ్లిక్ కు ప్రచారం చేసినా కూడా సినిమా జనాలకు రీచ్ కాలేదు. అయితే ప్రశంసలు మాత్రం దక్కాయన్న సంతృప్తి మేకర్స్ కు దక్కింది. ప్రతి రోజూ పండగే - చిత్రలహరి - సోలో బ్రతుకే సో బెటర్ లాంటి హిట్ల తో మాంచి జోష్ మీద ఉన్న సాయి కి ఇదో ప్లాప్ గా మిగిలింది. సాయి పూర్తిగా కోలుకుని నెక్ట్స్ సినిమా చేసేందుకు మరో యేడాది పట్టే అవకాశాలు ఉన్నాయి.