చిత్ర పరిశ్రమలో అటు కోలివుడ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది అనే విషయం తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో  తెర మీదికి వచ్చిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇలా కోలివుడ్ సినిమా అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ఆదరణ పొందింది రంగం సినిమా. 2011 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది అనే చెప్పాలి. ముఖ్యంగా యూత్ కి ఒక మంచి మెసేజ్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది.  రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత పడే కష్టాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చే మార్పులు అన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ఈ సినిమాలో.



 కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జీవా హీరోగా నటించాడు.. ఇక జీవా సరసన కార్తీక హీరోయిన్గా నటించి తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక హరీష్ జయరాజ్ అందించిన సంగీతం అయితే ఈ సినిమాకి ప్రాణం పోసింది.  ఇక ఈ సినిమాలోని పాటలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను నోళ్ళలో నానాయి రంగం సినిమా పాటలు. అంతల ఈ సినిమా స్టొరీ తో పాటు సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.



 విద్యార్థి నాయకుడిగా ఉన్న ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా కావాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మెరుగైన పాలన అందించాలి అని భావిస్తూ ఉంటాడు. అతనికి ఇక మీడియా రంగంలో ఉన్న ఒక స్నేహితుడు రహస్యంగా  మద్దతు ఇవ్వడం చేస్తూ ఉంటాడు. ఇక చివరికి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా మారిపోవటం ఎన్నో కుళ్లు కుతంత్రాలతో ఉన్న రాజకీయాలకు నాంది పలకడం తో చివరికి స్నేహితుడు చేతిలోనే ప్రాణాలు కోల్పోతాడు. అయితే చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది అన్న విషయాన్ని ఇక ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: