ఇక ఈ షోలో తన అందం అభినయంతో అలరిస్తూ వచ్చింది. దీంతో ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వచ్చిపడ్డాయి అని చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ వస్తోంది. అయితే ప్రియమణి నటనలోనే కాదు డాన్స్ లు కూడా బాగా చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన డాన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో కూడా అప్పుడప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మరోసారి ప్రియమణి అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి.
దీపావళి పండుగ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఈటీవీ నిర్వాహకులు తగ్గేదే అంటూ ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. స్పెషల్ ఈవెంట్ లో అలనాటి టాలీవుడ్ హీరోయిన్లు మన్నారా చోప్రా, రోజా సెల్వమణి, ప్రియమణి, పూర్ణ, ఇంద్రజ లు స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ క్రమంలోనే ప్రియమణి ఒక స్పెషల్ పర్ఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. డోలె డోలె దిల్ జర జరా అంటూ అదిరిపోయే పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఔరా అనిపించింది ప్రియమణి. మరోసారి తాను డ్యాన్సింగ్ క్వీన్ అనే విషయాన్ని నిరూపించుకుంది.