మొన్నటిదాకా సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు నిర్మించే నిర్మాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కరోనా వల్ల బిక్కు బిక్కు మని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు తమ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో, అసలు విడుదల అవుతాయో లేదో అన్నట్లుగా అందరు పడిగాపులు కాశారు. తీవ్రమైన భయాందోళనలు పేస్ చేశారు. పెరుగుతున్న వడ్డీ భారం వారిలో తీవ్రమైన వేదనను మిగిల్చింది.. దాంతో ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలా మంది తమ సినిమాలను ఓటీటీ కి అమ్మేసుకున్నారు.

ఏదైతే అదైందని చెప్పి ఓటీటీ లో పెద్ద హీరో ల సినిమాలు కూడా విడుదల అయ్యాయి. దాంతో ధియేటర్ ల పని అయిపొయింది. ఇక ఓటీ టీ లే రాజ్యమేలుతాయని అందరి భావించారు. దానికి తగ్గట్లే వరుసగా చాలా సినిమాలు ఓటీటీ లో విడుదలై అందరు ఇంట్లోనించి కదలకుండా చేశాయి. ఒక్కసారిగా ధియేటర్ యాజమాన్యాలు దీనిపై తీవ్రమైన ఆందోళనలు చేశాయి. నాని సినిమా విషయంలో నాని ని తీవ్రమైన విమర్శలు చేశారు వీరు.. అందులో నాని తప్పు ఏమీ లేకున్నా కూడా అయన సినిమా ఓటీటీ లో విడుదల అవడం వల్ల అయన విమర్శల పాలు అవ్వాల్సి వచ్చింది.

అయితే ఎట్టకేలకు ఇప్పుడు సినిమాలన్నీ ధియేటర్ లలోనే విడుదల అవుతుండడం తెలుగు సినిమాకు కలిసొచ్చే అంశం. కరోనా తగ్గిపోవడం, ప్రేక్షకులు కూడా థియేటర్లకు అలవాటు అవడం వంటివి చూస్తుంటే మునుపటి రోజులు టాలీవుడ్ కి వచ్చాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా వారు అందరు కూడా దీనిపై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా భారీ భారీ సినిమాలు, చిన్న సినిమాలు విడుదల ఆవుతున్నాయి. మళ్ళీ కరోనా అనే గోల లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది. మరి అందరు కోరుకున్న అచ్చే దిన్ కు ఎలాంటి ఆటంకం రాకూడదనే కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT