సినీ ఇండస్ట్రీలో ది బెస్ట్ పవర్ ఫుల్ యాక్టర్స్ అనగానే ముందుగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు గుర్తుకు రావాల్సిందే. "స్వర్గం నరకం" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నట రత్నం విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు మొత్తం 500 చిత్రాలకు పైగా నటించగా అందులో 180 సినిమాలకు పైగా హీరోగా మరియు మిగిలిన సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించారు. నిర్మాతగా హాఫ్ సెంచరీ కూడా చేసేశారు. అదేనండి దాదాపు 50 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మోహన్ బాబు. ఇటు సినీ రంగమే కాకుండా విద్య రంగం లోనూ అడుగు పెట్టి సేవలను అందిస్తూ తన కీర్తిని మరింత పెంచుకుంటున్నారు.

పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్న  ఈ మహనీయుడు చిత్తూరు వాస్తవ్యుడు. ఆంధ్రప్రదేశ్ లోని, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం లోని మోదుగులపాళెం. అప్పట్లోనే  డిగ్రీ ని కూడా పూర్తి చేశారు, సినిమాల్లోకి రాకముందు వ్యాయామ ఉపాధ్యాయుడుగా కూడా పనిచేశారు. మోహన్ బాబు విద్యాభ్యాసమంతా ఏర్పేడు, తిరుపతిలోనేజరిగింది. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో అలరించి  అశేష అభిమాన గణాన్ని సాధించిన మోహన్ బాబును ఒకప్పుడు నువ్వు  హైదరాబాద్ చూడగలవా అని కూడా అన్నారట, నటుడు కావాలనే ఆయన తపన ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆయన జన్మ స్థలం మోదుగులపాలెం అంటే ఆయనకు చాలా ప్రీతి.

ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికితే చాలు సొంత గూటికి వాలిపోతుంటారు. అలాగే ఆయన పిల్లలు మంచు లక్షి, విష్ణు, మనోజ్ లు కూడా సెలవులు వస్తే చాలు వాళ్ల సొంతూరిలోనే గడపడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మంచు లక్ష్మికి అయితే వారు ఊరు అన్నా, అక్కడి వాతావరణం, అక్కడి ప్రజలు మాట్లాడే విధానం అన్నా చాలా ఇష్టమని చెబుతుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: