కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం ఎంతోమందికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక ఆయన మరణంతో ఒక్కసారిగా ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు.. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఇదిలా ఉంటే పునీత్ రాజ్కుమార్ ఎంతో ఆరోగ్యంగా ఎంతో చురుగ్గా ఉండేవారని.. ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణం చెప్పడం అసాధ్యం అని  రాజ్ కుమార్ ఫ్యామిలీ డాక్టర్ అయిన రమణ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లో శుక్రవారం పునీత్ తన వద్దకు ఎలా వచ్చారో, అక్కడ ఏం జరిగిందో ఆయన వెల్లడించాడు.

ఈ క్రమంలో ఓ మీడియా సంస్థ తో రమణ రావు మాట్లాడుతూ " నలతగా ఉందంటూ పునీత్ తన భార్య అశ్వినితో కలిసి నన్ను సంప్రదించాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన నుంచి ఇలాంటి మాటలు నేను ఎప్పుడూ వినలేదు. కొన్ని పరీక్షలు చేశాను. ఆయన బీటీ సాధారణంగానే ఉంది. గుండె కూడా స్థిరంగా కొట్టుకుంది. ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య కూడా లేదు. కానీ ఆయనకు చెమటలు మాత్రం కారిపోతున్నాయి. అయితే జిమ్ చేయడం తర్వాత అది సాధారణమేనని ఆయన చెప్పారు. ఎందుకైనా మంచిదని ఆయనకు ఈసీజీ పరీక్ష చేశాను. అందులో ఓ స్ట్రెయిన్ ను గుర్తించాను. అప్పుడు ఆయన భార్య అశ్వినికి వెంటనే విక్రమ్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించాను.

 ఐదారు నిమిషాల్లో హాస్పిటల్ కి చేరుకున్నప్పటికీ ఆయన్ని మాత్రం బతికించుకోలేక పోయాం" అంటూ రమణా రావు పేర్కొన్నారు. ఇక పునీత్ రాజ్కుమార్ గురించి మరిన్ని విషయాలను ఆ వైద్యుడు వెల్లడిస్తూ..' ఆరోగ్యంపట్ల పునీత్ ఎంతో శ్రద్ధ వహించే వారు. ఆయన్ని చూసి నేర్చుకోవాలని నేను చాలామందికి సలహా ఇచ్చాను. ఇది ఒక హఠాత్పరిణామం. కానీ గుండెపోటు కాదు. కార్డియాక్ అరెస్ట్ కూడా కాదు. ఈ కార్డియాక్ అరెస్ట్ కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. కానీ అవేవీ కూడా పునీత్ విషయంలో కనిపించలేదు. ఇక ఆయనకు మధుమేహం,  అసాధారణ రక్తపోటు లాంటివి కూడా ఏమీ లేవు. పునీత్ విషయంలో ఏం జరిగిందో కచ్చితంగా చెప్పడం అసాధ్యం' అంటూ వెల్లడించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: