అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకునేలా దర్శకుడు వివి వినాయక్ తీసిన ఈ సినిమా పై అందరి నుండి మంచి స్పందన లభించి మూవీ అందరి నుడి బాగా పేరు అందుకుంది. అయితే ఈ మూవీ పై అప్పట్లో ఒక వివాదం సినిమా కలెక్షన్ పై కొంత ప్రభావాన్ని చూపింది అనే చెప్పాలి. మూవీలోని చారి పాత్రలో ఎన్టీఆర్ పలికిన డైలాగ్స్ తో పాటు ఆయన ఆహార్యం పై కూడా కొన్ని విమర్శలు చేసాయి పలు బ్రాహ్మణా సంఘాలు. కావాలనే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ ని దర్శక నిర్మాతలు పొందుపరిచారని, వాటిని వెంటనే తొలగించాలి అని బ్రాహ్మణ సంఘాలు అప్పట్లో ఈ అదుర్స్ సినిమా ఆడుతున్న థియేటర్స్ ని ముట్టడించడం జరిగింది.
అలానే ముఖ్యంగా అప్పట్లో తెలంగాణ లోని కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా ఆగిపోవడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కొంత మేర ఇబ్బందులు ఎదురుకొన్నారు. ఆ విధంగా పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నప్పటికీ సినిమా మాత్రం బాగుండడంతో అందరూ మూవీకి ఎంతో కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మాస్ సీన్స్ వంటివి పక్కాగా జొప్పించి తీయడంలో దర్శకుడు వివి వినాయక్ ఎంతో సఫలం అయ్యారు అనే చెప్పాలి.