కాగా కన్నడ రాజకుమార్ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ప్రత్యక్షదైవంగా మారిపోయారు. పునీత్ రాజ్ కుమార్. పునీత్ చారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎప్పటికప్పుడు తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. అంతే కాదు పేద ప్రజల కోసం స్కూల్స్ కాలేజీలు ఆస్పత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు చేశారు. ఇక ఇటీవలే పునీత్ రాజ్కుమార్ మరణంతో ఇక ఈ సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్లడం ఎలా అన్నది ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కుటుంబ సభ్యులు పునీత్ చనిపోయిన బాధలో ఉండటంతో ఇప్పట్లో వీటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు.
ఇలాంటి సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు కన్నడ హీరో విశాల్. నిన్న సాయంత్రం విశాల్ హీరోగా నటిస్తున్న ఏ నమీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్లో సినిమా బృందం పునీత్ కి నివాళులు అర్పించారు. పునీత్ లాంటి గొప్ప వ్యక్తి ఇప్పటివరకు నా జీవితంలో నేను చూడలేదు. ఆయన లేడు అంటే ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు హీరో విశాల్ ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు అటు సమాజానికి కూడా తీరని లోటు గానే మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు వరకు పునీత్ 1800 మంది చిన్నారులు చదివించారు. అయితే అతని స్నేహితుడిగా తాను ఆ బాధ్యత తీసుకుంటానని ఇకపై నేను చదివిస్తాను అంటూ హామీ ఇచ్చారు. అంతేకాదు పునీత్ చేసిన సేవా కార్యక్రమాలు అన్నింటికీ తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తాను అంటూ విషయాలు చెప్పుకొచ్చాడు హీరో విశాల్.