కానీ కథలను ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయిన తనీష్ ఆ తరవాత వరుసగా సినిమాలు ఫ్లాప్ అయి కొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ హీరో తెలుగు బిగ్ బాస్ లో కనిపించి మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా క్రేజ్ ను మళ్ళీ పెంచుకుని మరో ప్రస్థానం సినిమాను చేశారు తనీష్. జాని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని సాధించినప్పటికీ అనుకున్న ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ఈ మధ్య డ్రగ్స్ కేసు విషయంలో కూడా తనీష్ పేరు గట్టిగానే వినిపించింది..అయితే తనకు ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదని కేవలం ఆ నిర్మాతను సినిమా ఛాన్స్ కోసం కలవడం, ఆ తర్వాత పరిచయం పెరిగింది అని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే తనీష్ గురించి సోషల్ మీడియాలో విమర్శలు మరియు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఇవి అన్నీ మానేయండి అన్నీ చెప్పడం జరిగింది. పూర్తిగా తెలుసుకోకుండా ఏదంటే అది రాయకండి ప్లీజ్...అంటూ ఓ వీడియో అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో అయినా మంచి కథలను ఎన్నుకుని మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.