దర్శకుడు
శ్రీను వైట్ల కెరియర్ లో ఆగడు
సినిమా ఎంతటి ఘోర పరాభవాన్ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిం దే. మహేష్ బాబు తో ఆయన చేసి న దూకుడు
సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ మరొకసారి శ్రీనువైట్ల పై నమ్మకం ఉంచి ఇంకొక
సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఆగడు
సినిమా ప్రేక్షకుల ముందుకు ఎన్నో భారీ అంచనాలతో రాగా ఆ
సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. మహేష్ కెరీర్ లోనే భారీ ఫ్లాప్
సినిమా గా ఇది మిగిలిపోయింది.
అయితే శీను వైట్ల కెరీర్ పై ఈ ఎఫెక్ట్ బాగానే పడిందని చెప్పవచ్చు. ఆ చిత్రం తర్వాత ఆయన చేసిన ఏ
సినిమా కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. దాని తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద నిలవడంతో ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోయినంత పనిచేశాడు. ప్రస్తుతం ఆయన మంచు విష్ణుతో కలిసి ఢీ అండ్ ఢీ అనే
సినిమా చేస్తుండగా ఈ చిత్రం తనకు మళ్లీ పూర్వ వైభవం తీసుకు వస్తుందని మళ్లీ ఫామ్ లోకి తీసుకు వస్తుందని బాగా నమ్ముతున్నాడు.
ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆగడు
సినిమా చేయకపోతే ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వెల్లడించాడు. ఆగడు
సినిమా కి బదులుగా తనకు తమిళంలో దూకుడు
సినిమా రీమేక్ చేసే అవకాశం వచ్చిందని అందులో
అజిత్ హీరోగా నటించాల్సి ఉందని తెలిపాడు. ఒకవేళ ఆ
సినిమా చేసి ఉంటే ఇప్పుడు తన కెరీర్ వేరేలా ఉండేదని ఆయన చెప్పాడు. ఏదేమైనా శ్రీనువైట్లకు ఇలాంటి పరిస్థితి రావాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఆయన ఈ విధమైన ఫ్లాపులను అందుకుంటున్నాడు. మరి మంచు విష్ణు సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో చూడాలి.