2006 లో వచ్చిన పోకిరి సినిమా మహేష్ ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాశాడు. అటు తర్వాత వచ్చిన సైనికుడు, ఖలేజా, అతిధి వంటి సినిమాలు బారి డిజాస్టర్ ను చవిచూశాయి. ఇలాంటి సమయంలో మహేష్ కచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. అనుకుంటున్న సమయంలో శ్రీను వైట్లతో కలిసి దూకుడు సినిమా నీ చేశాడు మహేష్ బాబు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక దీంతో మరొకసారి మహేష్ బాబు తన ఇమేజ్ని పుంజుకున్నాడు.


ఇక దాంతో మరో అవకాశం కూడా శ్రీనువైట్లకు ఇచ్చాడు మహేష్ బాబు. అదే ఆగడు సినిమా. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చాయి. తాజాగా ఆలీ ప్రోగ్రాం లో గెస్ట్ గా శ్రీనువైట్ల వచ్చి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. ఆ విషయాలను ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


డైరెక్టర్ శ్రీనువైట్ల హీరో రాజశేఖర్ తో కలిసి అపరిచితుడు అనే మూవీ ని తీయడానికి షూటింగ్ మొదలు పెట్టాడట. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజతో కలిసి "నీకోసం" అని మూవీని తెరకెక్కించాడు. ఇక ఆ తరువాతే ఆనందం సినిమాకు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు రామోజీరావు అని చెప్పుకొచ్చాడు. దూకుడు సినిమాలో కొన్ని సన్నివేశాలను మహేష్ బాబే పెట్టించారని చెప్పుకొచ్చారు.


దూకుడు మూవీ లో ముఖ్యంగా మందు కొట్టే సీన్ లను మహేష్ బాబే పెట్టమని చెప్పినట్లుగా తెలియజేశారు శ్రీనువైట్ల. ఇక ఇదే సినిమాని రీమేక్ గా హీరో అజిత్ తో తెరకెక్కించే అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమా అవకాశాన్ని వదులుకోనని ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చారు శ్రీనువైట్ల. ముఖ్యంగా మహేష్ అభిమానుల నుంచి ఒక మాస్ ఫిలిం కావాలి అనడంతో.. ఆగడు సినిమాలు చేశాను కానీ అది ప్లాప్ అయ్యిందని  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: