నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలలో బింబి సారా కూడా ఒకటి. చారిత్రాత్మక నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే మొట్ట మొదటి సారిగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి అయి ఉండాలి. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది దాంతో ఈ చిత్రం ఆగిపోయిందా అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. సొంత బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో రిస్క్ చేసి మరి ఈ సినిమాను మొదలు పెట్టగా ఇప్పుడు ఇలాంటి అనుమానాలు రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మొదటి నుంచి తన సినిమాలను ఎక్కువగా తానే నిర్మించుకుంటూ వచ్చాడు కళ్యాణ్ రామ్. కథ విషయంలో దర్శకుడు విషయంలో ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకుండా కథను నమ్మి ప్రేక్షకులను అలరించే ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు ఎక్కువగా ఫ్లాపులే పలకరించాయి అని చెప్పవచ్చు. అన్నీ బాగానే ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో కళ్యాణ్ రామ్ తప్పటడుగులు వేయడం అదే ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలు ఇప్పటివరకు అవుతూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయే బింబీ సారా విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదు అని భావించి ఆచితూచి జాగ్రత్తగా వెళుతూ ఇప్పటివరకు షూటింగ్ చేస్తూ రాగా తాజాగా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకుందిఈ చిత్ర యూనిట్. దాంతో ఈ సినిమా బృందం ఎందుకు ఈ సినిమాను త్వరగా పూర్తి చేయలేక పోతుంది అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ఓ వైపు ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుండగా చిత్ర బృందం కూడా నోరు మెడపక పోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూనట్లు అవుతుంది. ఇప్పటికైనా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: