కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటని అందరికి తెలుసు.లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడడంతో చిత్ర పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని తెలుస్తుంది.

అయితే ఇదే సమయంలో ఓటీటీ రంగం దూసుకొచ్చిందని తెలుస్తోంది.ఒకప్పుడు సినిమా థియేటర్లలో కాకుండా ఆన్‌లైన్‌లో అధికారికంగా సినిమా విడుదలవుతుందంటే పెద్ద చర్చ జరిగిందని అందరకి తెలుసు. కానీ ఇప్పుడు ఇది సర్వసాధారణమైపోయిందని పిస్తుంది.ఓటీటీలో విడుదల చేసేందుకే ప్రత్యేకంగా కొన్ని సినిమాలను తెరకెక్కిస్తుంటేథియేటర్‌లో విడుదల కావాల్సిన చిత్రాలు కూడా కరోనా కారణంగా ఓటీటీ బాటపట్టాయని తెలుస్తుంది.అయితే చిన్న చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు అయితే ఏమో అనుకోవచ్చులే కానీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని తెలుస్తుంది.

తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరిందని తెలుస్తుంది.అదే మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మరక్కార్‌’. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చారిత్రాత్మక చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.చిత్ర నిర్మాత ఆంటోనీ పెరంబపూర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారట.అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే అర్జున్‌, కీర్తిసురేశ్‌ మరియు సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ లాంటి భారీ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ 2019లో పూర్తయిందని తెలుస్తుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకే ఏడాది పట్టిందని తొలుత ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావించిందని తెలుస్తుంది.అయితే కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుందని సమాచారం.

సెకండ్‌ వేవ్‌ తర్వాత అయినా థియేటర్లలో విడుదల చేద్దా మనుకున్నారని తెలుస్తోంది.అయితే అప్పటికే కేరళలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం థియేటర్‌ ఓనర్లు మరియు పంపిణీదారులు ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదని తెలుస్తుంది.దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఈ భారీ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేయాలని భావిస్తున్నారట.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని సమాచారం. మరి వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకట వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: