ఈ రోజు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు.  ఆయనకు టాలీవుడ్ ప్రముఖుల నుంచే కాదు వివిధ సినీ ఇండస్ట్రీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే కేక్ లు తీసుకొచ్చి మరీ ఆయనతో స్వయంగా కట్ చేయిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఈ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ బిజీబిజీగా గడుపుతున్నారు. విషెస్ చెప్పిన ఎవరినీ డిసప్పాయింట్ చేయకుండా అందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ నుంచి త్రివిక్రమ్ కు ఊహించని గిఫ్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కు.. త్రివిక్రమ్ కు ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి మెలుగుతుంటారు. ఇలాంటి బాండింగ్ ఉన్న ఈ ఇధ్దరు ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు.. కష్టనష్టాల్లో పాలుపంచుకుంటారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే కావడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు ఏం గిఫ్ట్ ఇస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా మెయిన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మళయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కుతోందని అందరికీ తెలుసు. ఈ చిత్రానికి సూర్యదేవ నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి వచ్చే అప్ డేట్స్ చూసి ఫ్యాన్స్ ఊహల్లోకి వెళ్లిపోతున్నారు.  

ఇక భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్క్రీన్ ప్లేతో పాటు సంభాషణలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా సెట్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్.. హీరో రానాకు ఓ సంఘటనకు సంబంధించిన ఫోటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక రానా టీ తాగుతుండగా.. త్రివిక్రమ్ చెప్పే డైలాగులను శ్రద్ధగా వింటున్నాడు. ఇక వాళ్ల బ్యాక్ గ్రౌండ్ లో గుడిసె కూడా కనిపిస్తూ ఉంది.ఇక దగ్గుబాటి రానా.. భీమ్లా నాయక్ నివాసానికి వెళ్లి.. ఆయన సతీమణి నిత్యామీనన్ తో మాట్లాడే దృశ్యంగా తెలుస్తోంది. రానా అయితే పదవీవిరమణ పొందిన డేనియర్ శేఖర్ గా పోషిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ కు.. హవాల్దార్ కు మధ్య ఇగోను చూపిస్తూ ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు లాలా.. భీమ్లా పూర్తి సాంగ్ కూడా విడుదలైంది. ఈ టైటిల్ సాంగ్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: