హీరో వేషాలు తగ్గాక కొందరు నటులు విలన్ వేషాలు వేస్తుంటారు. అవీ తగ్గాక క్యారెక్టర్ నటులుగా వెండి తెరపై కనువిందు చేస్తుంటారు. సినీ మాయా ప్రపంచంలో ఎత్తు పల్లాలు సహజం. తెలుగు నటుల్లో  హీరో ల కన్నా విలన్ లకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనే నానుడి ఎనభయ్యో దశకం లో ఉండింది. అందు కనే అప్పడు సినిమాలో టైటిల్స్ అన్నీ కూడా  దొంగ, రాక్షసుడు, కిరాతకుడు, ... ఇలా విలనిజం కలిగి ఉండేవి.  ఆ రోజుల్లో  కన్నడ నాట  మంచి ఫాలోయింగ్ ఉన్న హీ రో చరణ్ రాజ్. ఆయన  నటించిన కన్నడ చిత్రాలు మినిమం  వంద రోజులు ఆడేవి. ఆయన నటించిన కన్నడ చిత్రం అపరాజిత  కన్నడ సినీ పరిశ్రమలో బాక్సాఫీసు వద్ద  సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో బిజీగా ఉన్న చరణ్ రాజ్ తెలుగు సినీ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ తో అనుబంధం ఉంది. ఆ సంస్థ అధినేత రామోజీ రావుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా చరణ్ రాజ్ కు పేరుంది.  రామోజీ రావు కోరిక మేరకు చరణ్ రాజ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు.


ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ప్రతిఘటన లో ఆయన ప్రతినాయకుని పాత్ర పోషించారు. ఆబాల గోపాలన్నీ అలరించారు.  1986 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను తిరగ రాసింది. అంతే కాదు ఈ చిత్రం ఎన్నోఅవార్డులను అందుకుంది.  తరువాత సంవత్సరం ఈ చిత్రాన్ని హీందీ లో పునర్ నిర్మించారు. అందులోనూ విలన్ పాత్ర చరణ్ రాజ్ పోషించడం గమనార్హం. సహజంగా హింతీ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి తమిళానికి,  లేదా కన్నడ చిత్ర సీమకు మహీళా నటులు వలస వెల్లడం చూస్తుంటాం. కానీ విలన్ పాత్రల ద్వారా  దక్షిణ భారత్ లోని భాషలలోనూ చరణ్ రాజ్ తనదైన పాత్ర పోషించారు. తెలుగు సినీ రంగంలో ఆయన పోషించిన పాత్రలు అద్వితీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.  దొంగ మొగుడు, స్వయం కృషి, ఇంద్రుడు-చంద్రుడు, తదితర చిత్రాలలో ఆయన తనదైన నటనను ప్రదర్శించారు.  సినీనటి విజయశాంతి కి  పెద్ద పెద్ద అవార్డులు తెచ్చి పెట్టిన రెండు చిత్రాలు ప్రతిఘటన, కర్తవ్యం లలో చరణ్ రాజ్ విలన్. ప్రతిఘటన చిత్రం ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాన్ని తీసుకు వచ్చి పెడితే, కర్తవ్యం చిత్రం ఏకంగా అమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు లభించే లా చేసింది. ఈ రెండు సినిమాలు  జనాల హృదయాన్ని దోచుకోవడంలో విలన్ గా నటించిన చరణ్ రాజ్ పాత్ర ఉందని విజయ శాంతి పలు సందర్భాలలో పేర్కోన్నారు. చరణ్ రాజ్ మంచి నటుడే కాదండోయ్, మంచి పాట గాడు, వంటగాడు కూడా. ఆయన చేతి వంట  ఆరంగించిన నటీనటులు ఇప్పటికీ  ఆ రుచిని నెమర వేసుకుంటుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: