తమిళ అగ్రనటుడు సూర్య ప్రధానపాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'జై భీమ్' ఈ సినిమా ఇటీవల ఓ టి టి వేదికగా విడుదలై మంచి విజయం తో పాటు భారీ ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇప్పటికే వరుస రికార్డులను సృష్టిస్తోంది ఈ సినిమా. దళిత వర్గాల పై పోలీసులు ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారంటూ అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రతి ఒక్కరిని ఎంతో కదలిస్తోంది. ఇక సినిమాలో దళిత వర్గాల తరుపున నిలబడి వాదించిన లాయర్ పాత్రలో సూర్య అత్యద్భుతమైన నటనను కనబరిచాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే జై భీమ్ సినిమా చూశారా? అనే ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ప్రేక్షకులపై ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థమవుతుంది. 1995 సంవత్సరంలో జరిగిన  యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అప్పటి లాయర్ జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించిన విధానం సినిమాలో నటీనటుల నటన ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో జై భీమ్ సినిమాని తెగ  చూసేస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమా ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా ఈ సినిమా మా ఓ అరుదైన ఘనతను సాధించింది.

 ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ అయిన ఐఎండీబీ సినిమాల జాబితాలో ఏకంగా మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది జై భీమ్ సినిమా. ఈ సినిమాకి సుమారు 53 వేలకు పైగా ఓట్లు 9.6 రేటింగ్ తో ఈ సినిమా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక మొన్నటి వరకు ఇదే జాబితాలో ఉన్న ప్రముఖ చిత్రం షాషాంక్ రిడంప్షన్‌ సినిమాను సైతం వెనక్కి నెట్టి జై భీమ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక మరోవైపు సూర్య హీరోగా నటించి ఐఎమ్‌డీబీ టాప్‌ 10 లిస్ట్ లో చోటు దక్కించుకున్న సినిమాల్లో జై భీమ్ సినిమా రెండో చిత్రం కావడం విశేషం. గతంలో సూర్య నటించిన ఆకాశం నీ హ

మరింత సమాచారం తెలుసుకోండి: