ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతొ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారని తెలుస్తుంది.
పుష్ప చిత్ర యూనిట్ వదులుతున్న ఆసక్తికర అప్డేట్ లు ఈ సినిమాపై మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయని తెలుస్తుంది.. అయితే పుష్ప మేకర్స్ లీకుల సమస్య పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తుంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఎదో ఒక ఫోటోనో లేదా వీడియో నో బయటకు వస్తూనే ఉందని తెలుస్తుంది.. ఇక తాజాగా సెట్స్ నుండి లీకైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం.
నవంబర్ 4న దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి డాన్స్ నంబర్ నుండి ఒక స్టిల్ ను అభిమానులతో పంచుకున్నారని తెలుస్తుంది.
ఈ పాట 1000 మంది డాన్సర్లతో భారీ స్థాయిలో చిత్రీకరించారని తెలుస్తుంది.. ఇది బిగ్ స్క్రీన్ మీద అభిమానులకు పెద్ద పండుగ అనే చెప్పవచ్చు తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయినా వీడియో ఈ పాట చిత్రీకరణకు సంబందించినది అని సమాచారం.ఇక ఈ పాట చిత్రీకరణ సమయంలో సెట్ మొత్తం జాతర లాగా తలపిస్తుందని తెలుస్తుంది.. ఈ వీడియోలో ''హే బిడ్డా ఇది నా అడ్డా'' అంటూ బీట్ వినిపిస్తుండగా అల్లు అర్జున్ రంగురంగుల పొగ మధ్య 1000 మంది బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారని తెలుస్తుంది.ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఈసారి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటూ సంతోష పడుతున్నారని తెలుస్తుంది.ఈ సాంగ్ ను రివీల్ చేస్తూ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ అనుకున్నారని కానీ అంతక ముందే ఈ సాంగ్ లీక్ అవ్వడంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారని సమాచారం..