
ఇటు సోషల్ మీడియాలోనూ గీతకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన న్యూ అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటారు గీతా. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ మరియు తన సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకోవడం అలాగే సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటివి చేస్తూ తన అభిమానులకు ఎపుడు టచ్ లో ఉంటారు. చిన్న వయసు నుండే శాస్త్రీయ, లలిత, సినీ వంటి సంగీతాలలో శిక్షణ పొంది నైపుణ్యం సంపాదించారు గీతా మాధురి. సినిమాలలో పాటలు పాడటమే కాకుండా ఎన్నో స్టేజ్ షోలు కూడా చేశారు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని మరింత క్రేజ్ ను పెంచుకున్న ఈమె ఆ రియాలిటీ షో లో టాప్ 2 లో నిలిచారు. ఇక ఈమె ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడగా వాటిలో నచ్చావులే మూవీ లో నిన్నే నిన్నే కోరా, చిరుత మూవీలో "చంక చంక చంకెరె", గోలీమార్ మూవీలో "మగాళ్లు వట్టి మాయగాల్లే" వంటి పలు పాటలు సంచలనం సృష్టించాయి. సినీ నటుడు ఆనంద కృష్ణ అలియాస్ నందుని 2014 ఫిబ్రవరి 9న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. తన పేరు దాక్షాయణి ప్రకృతి. గీత మాస్ సాంగ్స్ పాడడంలో దిట్ట అని చెప్పాలి.