సీనియర్ హీరోలకి కథలు ఈజీగానే దొరుకుతున్నాయి గానీ, హీరోయిన్లు దొరకడం లేదు.  ఇన్నాళ్లూ ఫస్ట్ ఆప్షన్‌గా కనిపించిన నయనతార ఇప్పుడు తెలుగు సినిమాలు తగ్గించింది. రెగ్యులర్ కమర్షియల్‌ మూవీస్‌ చేయడం లేదు. కథలో హీరోయిన్‌కి ఇంపార్టెన్స్‌ ఉంటేనే ఓకే చేస్తోంది. లేకపోతే లేదని చెప్తోంది. అనుష్క ఇంతకుముందు సీనియర్ హీరోలకి ఒక ఆప్షన్‌గా కనిపించేది. కానీ స్వీటీ బరువు పెరిగాక సీనియర్లు కూడా ఈమెతో సినిమాలు చేయడం లేదు. ఫేస్‌లో చార్మింగ్‌ లేదని, హీరోయిన్‌ లుక్‌లో కనిపించడం లేదని ఈమెని పక్కనపెడుతున్నారు. దీంతో లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తోనే సర్దుకుంటోంది.

కాజల్‌ అగర్వాల్ వయసు 35 దాటినా యంగ్‌స్టర్స్‌, సీనియర్స్‌ ఇద్దరినీ కవర్‌ చేసేది. పెళ్లి తర్వాత కూడా చిరంజీవితో 'ఆచార్య', నాగార్జునతో 'ది ఘోస్ట్' సినిమాలకి సైన్ చేసింది. అయితే ఇప్పుడు కాజల్‌ ప్రెగ్నెంట్‌ అని తెలుస్తోంది. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకి బ్రేక్ ఇస్తోంది కాజల్. నయనతార, అనుష్క, కాజల్‌ సినిమాలు తగ్గించడంతో తమన్నా బిజీ అవుతోంది. సీనియర్‌ స్టార్స్‌కి ఈ హీరోయిన్ బెస్ట్‌ ఆప్షన్‌గా మారిపోయింది. చిరంజీవి, మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో 'భోళా శంకర్' అనే సినిమా వస్తోంది. ఈ మూవీలో తమన్నాని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇంతకుముందు తమన్నా చిరుతో 'సైరా' సినిమా చేసింది.

తమన్నా ఇప్పటికే మరో సీనియర్ హీరో వెంకటేశ్‌తో 'ఎఫ్2' సినిమా చేసింది. ఇప్పుడీ మూవీ సీక్వెల్‌ 'ఎఫ్3'లోనూ నటిస్తోంది. తమన్న థర్టీ ప్లస్‌లో అడుగుపెట్టాక విజయాలకంటే పరాజయాలు ఎక్కువగా వచ్చాయి. దీంతో మిల్కీ బ్యూటీ కెరీర్‌కి బ్రేకులు పడతాయనే ప్రచారం జరిగింది. కానీ సీనియర్స్‌ సినిమాలతో తమన్నా మళ్లీ బిజీ అవుతోంది. శ్రుతీ హాసన్‌కి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. రవితేజ 'క్రాక్' సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన శ్రుతి పాన్‌ ఇండియన్‌ మూవీస్‌తో పాటు, సీనియర్స్‌తో కూడా సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో 'సలార్' చేస్తోన్న శ్రుతి, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో కూడా హీరోయిన్‌గా చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: