వరుస ఆఫర్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న పూజాహెగ్దే.. ఒక్కో సినిమాకి 3 కోట్లు నుండి 4కోట్లు వరకు తీసుకుంటుందట. నిర్మాతలు కూడా అమ్మడు ఫిగర్ కి..క్రేజ్ కి అడిగినంత డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని టాక్. అయితే పూజా తన ఫిజిక్ ని కాపాడుకోవడానికి ఏం చేస్తుందో తెలుసా..? గంటల తరబడి జిమ్ లో వ్యాయామాలు చేయదు. ఫుల్ గా ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూనే.. ‘పైలేట్స్ ఎక్సర్ సైజ్’ చేస్తుందట. పూజా ఎప్పుడు జిమ్ కి వెళ్లినా ఎక్కువసేపు ఈ వ్యాయామం చేస్తుందట. ఒక్క వేళ జిం కు వెళ్లలేకపోయినా ఇంట్లోనైనా చేస్తుందట. ఒక్కటి అంటే ఒక్కరోజు కూడా ఈ సెషన్ ను మిస్ చేయదట. దీంతో పాటు యోగా కూడా చేస్తుంటుందట. ఇలా చేయడం వల్లే ఆమె ఫిజిక్ ను పెర్ఫెక్ట్ గా కాపాడుకోగలుగుతుందట.
ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పూజా హెగ్డే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ లో ప్రేరణ గా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కు జోడీగా నీలాంబరి గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.