టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ 'పుష్ప'. ఈ సినిమా కోసం సౌత్ సినీ ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాని పూర్తి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం బన్నీ ఊర మాస్ లుక్ లోకి మారి అందరిని ఆశ్చర్య పరిచాడు.

 ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ వన్ డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ఏకంగా మూడు భాషల్లో తనకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా అల్లు అర్జున్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటారట. అంతే కాకుండా తమిళం లేదా కన్నడలో సైతం బన్నీ తన గొంతును వినిపిస్తారని అంటున్నారు. ఓ స్టార్ హీరో నిజానికి పాన్ ఇండియా సినిమా కోసం సొంతంగా ఏకంగా..

మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం అనే చెప్పాలి. అయితే సుకుమార్ తెరకెక్కించిన సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ తో పాటు డైలాగ్స్ కూడా చాలా డిఫరెంట్ టైమింగ్స్ తో ఉంటాయి. కాబట్టి మిగతా భాషల్లో కూడా అల్లుఅర్జున్ స్వయంగా అదే టైమింగ్ తో డైలాగ్స్ చెప్తాడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా పాన్ ఇండియా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి బన్నీ శతవిధాల ప్రయత్నిస్తున్నాడు అనే చెప్పాలి. ఇక బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకి అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో ఈ పాటలు సరి కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: