సినిమా పరిశ్రమలో అయిన దర్శకులు ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేసి తమను తాము ప్రతి సినిమాతో నిరూపించుకోవాలి లేదంటే ఒకే సినిమాకు లేదా కొద్దికాలానికే మాత్రమే వారు సినిమాలకు పరిమితమయి తమ కెరీర్ ను చేసుకోవాల్సి వస్తుంది.  ఇకపోతే చాలా మంది దర్శకుల విషయంలో ఒకటి తరచూ జరుగుతూ ఉంటుంది. అది ఏమిటంటే వాళ్ళు చేసే తొలి సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది కానీ రెండో సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించదు అలా వారు ద్వితీయ దాటలేక పోతూ ఉంటారు.

ఆ విధంగా తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించి చాలా మంది ద్వితీయ విజ్ఞాన్ని దాటలేక ఫెయిల్ అయిపోయిన దర్శకులు చాలామంది ఉన్నారు.  తాజాగా ఈ జాబితాలోకి మరొకరు చేరినట్లు కనిపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ కలెక్షన్లను తెచ్చిపెట్టింది.

అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా మహాసముద్రం దసరా కి విడుదల కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది.  శర్వానంద్ మరియు సిద్ధార్థ హీరోగా నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా విడుదలైన తొలి రోజు నుంచే ఈ చిత్రం భారీ ఫ్లాప్ ని టాక్ మూట గట్టుకుంది. దాంతో ఈ దర్శకుడు తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు.. అసలు హీరోలు ఈ దర్శకుడికి పట్టించుకుంటారా అనే సందేహాలను కలుగజేస్తుంది. మరి తొలి సినిమా విషయంలో తీసుకున్న జాగ్రత్త ఈ సినిమా విషయంలో తీసుకొని ఉంటే ఈ విధమైన పరిస్థితి వచ్చేది కాదు అని సినిమా విశ్లేషకులు అజయ్ భూపతికి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడు అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: