ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ అంచనాలను అందుకోవడం కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం అయితే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడూ మరచిపోలేదు అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నాన్నమ్మ జేజి పాత్రలో ఒక కొత్త నటి నటించింది. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఈమె ముఖం చూసి ఉండరు. అయితే ఇలా టెంపర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ నాన్నమ్మ గా నటించిన నటి కొడుకు పెద్ద స్టార్ హీరో అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
అంతేకాదు మోస్ట్ టాలెంటెడ్ సపోర్ట్ ఆర్టిస్టుగా కూడా ఎంతో ప్రశంసలు అందుకుంది ఈమె. ఆమె పేరు సుప్రియ పాతక్. గుజరాత్ కి చెందిన ఈమె చిన్నప్పుడు నుంచి నటనపై మక్కువ ఉండడంతో ఎన్నో నాటకాల్లో కూడా నటించే వారు. ఆ తర్వాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అవకాశాలు దక్కించుకుంది. సుప్రియ ఒకప్పుడు మంచి నటుడు అయిన పంకజ్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే సుప్రియ పంకజ్ కపూర్ కి రెండో భార్య కావడం గమనార్హం. అయితే పంకజ్ కపూర్ కొడుకు షాహిద్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. అయితే సుప్రియా పాఠక్ షాహిద్ కపూర్ కి పిన్ని వరస అవుతుంది . తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ సర్కార్ మూవీ తో ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత అరవింద సమేత అనే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.