టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మొదటి సారి కలిసి నటిస్తున్న ఈ సినిమాని సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో దానయ్య నిర్మిస్తున్నారు. 1920 కాలం నాటి బ్రిటిష్ పరిపాలన నేపథ్యంలో కల్పిత కథగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు చరణ్, కొమురం భీం గా తారక్ కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

 ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన గ్లిమ్స్ వీడియో, నాటు నాటు సాంగ్స్ కి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన వచ్చింది. ఇక ఇదిలా ఉంటే జనవరి 7న విడుదల అవుతున్న ఈ సినిమాకు పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి. దీంతో రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఇన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. ఇక నార్త్ లో రాజమౌళి సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర లేదు. ఇక 'ఆర్ ఆర్ ఆర్' మూవీ లో రామ్ చరణ్ కి జోడీగా ఆలియాభట్ సీత పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక 'ఆర్ ఆర్ ఆర్'  టైంలోనే..

ఆలియాభట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించిన 'గంగుబాయి కతీయావాడి' సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమైంది. జనవరి 6వ తేదీన ఈ సినిమాని ముందుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని జనవరి 6న కాకుండా ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం కోసమే ఆలియా భట్,భన్సాలీల చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే నిర్మాతలకు నష్టం తప్పదు. అందువల్లే 'ఆర్ ఆర్ ఆర్' పోటీ నుంచి ఆలియా భట్ 'గంగుబాయి' చిత్రం తప్పుకున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: