అయితే వరుణ్ తేజ్ చెల్లి మెగా డాటర్ నిహారిక కూడా మొన్నటివరకు సినిమాల్లో కొనసాగింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. అయితే వరుణ్ తేజ్ నిహారిక మధ్య ఎఫెక్షన్ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. వీరిద్దరూ ఒకచోట చేరారు అంటే చాలు ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. ఇక వీరిని చూస్తే అన్నా చెల్లెలు అంటే ఇలాగే ఉండాలి ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా చెల్లెలు అన్న తర్వాత అన్నలు ఏదో ఒక ముద్దు పేరు పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.
ఇలా సినీ సెలబ్రిటీల ముద్దుపేరు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందరూ. దీనికోసం సోషల్ మీడియాలో తెగ వెతుకుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు వెతకాల్సిన పని లేదు. ఏకంగా మెగా డాటర్ నిహారిక తన అన్న వరుణ్ తేజ్ తనను ఏమని పిలుస్తాడు అన్న విషయాన్ని ఇటీవలే ఒక షోలో చెప్పుకొచ్చింది. అందరికంటే మా అన్న చాలా డిఫరెంట్ ఒక్కో సందర్భంలో ఒక్కో విధం గా పిలుస్తుంటాడు.. మామూలుగా అయితే నిహ.. కాస్త ముద్దు అనిపిస్తే బంగారం.. ఇంకా ఎక్కువ ముద్దు అనిపిస్తే పంది అంటూ మా అన్న నన్ను పిలుస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చింది మెగా డాటర్ నిహారిక.