గబ్బర్‌ సింగ్‌ :

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎగబడి చూస్తారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా. ఈ సినిమా దాదాపు తొమ్మిది సంవత్సరాల కిందట వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అంటే 2012 సంవత్సరం వేసవి కాలంలో ఈ సినిమా మా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  గబ్బర్ సింగ్ సినిమా 30 కోట్ల బడ్జెట్ తో తీసినప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు మాత్రం 150 కోట్లు దాటేసింది. ఈ లెక్కలు చూస్తే నే పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ సెలబ్రేషన్ గా నటించింది. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ టైటిల్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే గబ్బర్ సింగ్ సినిమాకు టైటిల్ సాంగ్ హైలెట్గా నిలిచింది. ఈ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి నోట్లో నానుతూ ఉంది. ఈ పాట అప్పట్లో యూట్యూబ్‌ ను షేక్ చేసేంది.

జోంబీ రెడ్డి

జోంబీ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఈ జోంబీ రెడ్డి సినిమా ను ప్రశాంత్‌ వర్మ అనే యంగ్‌ డైరెక్టర్‌ డైరెక్ట్‌ చేశారు.  ఈ సినిమా పూర్తి గా కామెడీ జోనర్‌ లో వచ్చింది.  ఇక ఈ జోంబీ రెడ్డి సినిమా లో తేజా సజ్జా, అలాగే...  ఆనంది మరియు దక్ష నాగస్కర్‌ కీలక పాత్రల్లోనూ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.  ఇక ఆపీల్‌ ట్రీ స్టూడియోస్‌ నిర్మాణం చేసిన ఈ జోంబీ రెడ్డి సినిమా చాలా బాగా హిట్‌ అయింది. ఈ సినిమా ఫిబ్ర వరి 5 వ తేదీన 2021 సంవత్సరం లో థియేటర్లలో విడుదల కావడం విషేషం.  అయితే.. ఈ జోంబీ రెడ్డి సినిమా రిలీజ్‌ అయిన  టు వంటి టైటిల్‌ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: