దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా ఎంతో మంది యువతను ఆకర్షించిన నయనతార ఇక ఇప్పుడు ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోంది. ఒకప్పుడు  తమిళ కన్నడ మలయా ళసినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తా చాటింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి అనే సినిమా తెలుగులో కూడా డబ్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది నయనతార.


 ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన లక్ష్మి సినిమాలో నటించి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైంది. తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా నటించి తన సత్తా చాటింది. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా.. చీరకట్టులో కూడా కనిపిస్తూ తన అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఏకంగా స్టార్ హీరోలకు పోటీగా పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారిపోయింది నయనతార.



 కాగా నేడు నయనతార పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు సినీ ప్రముఖులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా నయనతార గురించి పలు విషయాలను తెలుసుకుందాం నయనతార అసలు పేరు డయానా మారియమ్‌ కురియన్‌. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బెంగళూరులో  1984 నవంబరు 18న జన్మించింది ఈ కేరళ కుట్టి . తండ్రి పేరు కురియన్‌ కొడియట్టు, తల్లి ఒమన్‌ కురియన్‌. తండ్రి ఎయిర్ఫోర్స్ ఉద్యోగిగా పని చేసేవాడు. చిన్నప్పటి నుండే  మోడలింగ్‌ అంటే నయనతారకు ఎంతో ఆసక్తి ఉండేది. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే  మోడలింగ్ ప్రయత్నించింది నయనతార.  అప్పట్లో నయనతార కి సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ  అవకాశం రావడంతో  మళయాళంలో విడుదలైన 'మనస్పినక్కరే' సినిమాతో ఆమె వెండితెరకు వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది.  ఇక ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగింది అని అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: