మెగాస్టార్ తనయుడుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన హీరోగా చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించగా మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యే విధంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా తొలిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తుండటం విశేషం.

రామ్ చరణ్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాగా ఈ చిత్రం తర్వాత ఆయన గౌతమ్ తిన్ననూరి అనే యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ విధంగా ఒక సీనియర్ డైరెక్టర్ మరియు యంగ్ డైరెక్టర్ లతో ఆయన సినిమాలు ప్లాన్ చేసి సక్సెస్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ మరొకసారి సీనియర్ దర్శకుడితో స్టార్ దర్శకుడు తో సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా రామ్ చరణ్ తన కెరియర్ ను ఎంత గా బిల్డ్ చేసుకుంటున్నాడో అర్థమవుతుంది. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా ఆయన తన కెరియర్ ను బిల్డ్ చేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్నాడు. మెగాస్టార్ తర్వాత ఆయన వారసుడిగా అంతటి వాడిగా ఎదగడానికి బాగా కష్టపడుతున్నాడు రామ్ చరణ్. మరి ఆయన కష్టానికి ఫలితం ఏ రూపంలో దక్కుతుందో చూడాలి. నటన పరంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు రాబోయే సినిమాలతో తండ్రికి మించిన కొడుకు గా తనని తను నిరూపించుకుంటాడా  అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: