ప్రముఖ దర్శకుడు ఈ. వీ.వీ.సత్యనారాయణ రెండవ కుమారుడుగా సినీ ఇండస్ట్రీలోకి అల్లరి సినిమాతో అడుగుపెట్టిన అల్లరి నరేష్ ఆ సినిమాతో తన కెరీర్ ను మార్చుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత అన్ని కామెడీ జానర్ లోనే సినిమాలు ఎంచుకోవడం గమనార్హం. ఇకపోతే ఎక్కువగా తన తండ్రి దర్శకత్వంలోనే సినిమాలను తెరకెక్కించి మంచి కామెడీ టైమింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ తను నటించే ప్రతి సినిమా కూడా కామెడీ పండించడంలో ఆయనకు ఆయనే సాటి అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు..


ఇకపోతే ఒకానొక సమయంలో స్టార్ పొజిషన్ కు సిద్ధంగా ఉన్నాడు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన కెరియర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అంతేకాదు దాదాపుగా ఎనిమిది సంవత్సరాలపాటు అల్లరి నరేష్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయవంతం కాకపోవడం గమనార్హం. అనుకున్న ఏ పని కూడా సక్సెస్ కాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. కానీ ఈ సంవత్సరం జనవరి నెల మాత్రం అల్లరి నరేష్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.


ఎప్పుడూ అల్లరిగా కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేష్, ఈసారి నాంది సినిమాతో ఒక్కసారిగా భయపెట్టేసాడు. అంతేకాదు అల్లరిగా చూసిన నరేష్ ను సీరియస్ గా  చూడడంతో ప్రేక్షకులు అందరూ ఆశ్చర్య పోవడం తో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని కురిపించారు. ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమేదల దర్శకత్వంలో తెరకెక్కిన నాంది సినిమాలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అంతేకాదు నరేష్ కు లక్కీ లేడీగా మారిన వరలక్ష్మి ఆ తర్వాత క్రాక్ సినిమాతో రవి తేజ కి కూడా మంచి హిట్ ను అందించింది. ఇక అలా నాంది సినిమాతో దాదాపు 8 సంవత్సరాల తర్వాత తలరాతను మార్చుకున్నాడు అల్లరి నరేష్..

మరింత సమాచారం తెలుసుకోండి: