రాజమౌళి దర్శకత్వంలో లో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 7న ప్రేక్షకులముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న rrr సినిమాకి సంగీతాన్ని కీరవాణిగారు అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోలుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ నటిస్తుండగా హీరోయిన్లుగా అలియా భట్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

 అంతే కాకుండా కొన్ని కీలక పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు నటిస్తున్నారట. అయితే ప్రస్తుతం  RRR సినిమా చేస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్సినిమా తర్వాత కొరటాల తో కలిసి మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారట. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే జాన్వీ కపూర్ కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ని అనుకున్నట్టు రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ .

 ఈ విషయంలో నిజమెంతో అబద్ధమెంతో మేకర్స్ నోటి నుండి అధికారికంగా ప్రకటించే  దాక తెలియదు. కొరటాల శివ ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు అయితే ఈ సినిమాను కొరటాల వచ్చే ఏడాది విడుదల చేయనున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రం తన మూవీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 22 నా విడుదల కూడా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తీసిన ఈ సినిమా మా మొదటి సినిమా ఏం కాదు ఇంతకుముందు  వీరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా మా పెద్ద హిట్ కావడంతో ప్రస్తుతం వచ్చే సినిమా కూడా అదే రేంజిలో ఉంటుందా లేదా అని అని వీరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: