అయితే ఈసారి ‘ఆర్ ఆర్ ఆర్’ స్వాతంత్ర ఉద్యమ నేపధ్యంలో నడిచే కథ కాబట్టి ఈసారి రాజమౌళి టీమ్ లో వ్యూహాత్మకంగా బుర్రా సాయి మాధవ్ వచ్చి చేరాడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈసినిమా పై ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రచయిత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ ఘన విజయాన్ని అంచనా వేయడానికి కొలమానాలు సరిపోవని ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఊహించని కనీవినీ ఎరుగని ఘనవిజయం ‘ఆర్ ఆర్ ఆర్’ సాధించబోతోంది అంటూ జోశ్యం చెప్పాడు.
ఇప్పుడు ఈ కామెంట్స్ జూనియర్ చరణ్ అభిమానులలో వైరల్ గా మారాయి. దీనితో ఈమూవీ పై వారు మరింత అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే ఈ కామెంట్స్ పరిశీలించిన కొందరు విశ్లేషకులు మాత్రం వేరే విధంగా అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన భారీ సినిమాలు ఎలాంటి పోటీ లేకుండా విడుదల అయ్యాయి.
అయితే ఈసారి ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇలాంటి అవకాశం దక్కడంలేదు. ఈమూవీకి పోటీగా మరో రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ పై ప్రశంసలు కురిపించడానికి ఒక వర్గం రెడీగా ఉంటే మరొక వర్గం ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఏచిన్న తేడా కనిపించినా దానిని హైలెట్ చేసి ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కుని ‘ఆర్ ఆర్ ఆర్’ బుర్రా సాయి మాధవ్ చెప్పినట్లుగా ఆకాశమే హద్దుగా ఘన విజయం సాధిస్తుందో చూడాలి..