తన అందంతో, సహజమైన నటనతో ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగించింది, హీరోయిన్ జయసుధ. ఈమె ప్రస్తుత వయస్సు 62 సంవత్సరాలు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్ర కథానాయకులతో నటించింది ఈమె. ప్రస్తుతం సినిమాలో సహాయ నటిగా కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇమే ఎమ్మెల్యేగా కూడా కొన్ని సేవలను అందించింది జయసుధ. అయితే ఇటీవల ఒక ఫోటోని షేర్ చేయడం వల్ల అది వైరల్ గా మారింది, ఆ ఫోటో వివరాలను చూద్దాం.


తాజాగా జరిగిన మా ఎన్నికలలో కూడా ఈమె పోటీలో నిలబడతారు అనే ప్రచారం బాగా వినిపించింది. ఈ విషయంపై  ఈమె ఏ విధంగా స్పందించలేదు. అయితే నిన్నటి రోజున సోషల్ మీడియాలో తన ఫోటోతో ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఈ ఫోటోలో ఉన్నటువంటి జయసుధని చూస్తే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మొత్తం జయసుధ రూపురేఖలు మారిపోయాయి. ముఖంలో ఇదివరకు ఉన్నటువంటి ఛాయ్ కనిపించడం లేదు. దీంతో ఆమె ఏదో ఒక  సమస్యతో బాధపడుతున్నట్లు గా అర్థం అవుతోంది అంటూ కొంత మంది నెటిజన్లు తెలియజేస్తున్నారు.

కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె విదేశాలకు వెళ్లిందని సమాచారం. అలా చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత ఆమె హైదరాబాద్ కి వస్తున్నారని వార్త కూడా వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై అధికారకంగా ఈ విషయాన్ని ప్రకటించడం లేదు. అయితే తన తాజా ఫోటోలు మాత్రం ట్విట్టర్లో తెలియజేసింది.
షేర్ చేసినటువంటి ఫోటో పై ఒక నెటిజన్ స్పందిస్తు.. మన దేశంలో ఎందరో మీలాంటి వారి ఆరోగ్యంపై ఎన్నో రకరకాల వార్తలు రాస్తునప్పటికీ.. వాటన్నిటికీ మీరు ఈ రోజున తెరదించారు.. అదే సహజమైన నవ్వుతో మీరు ఈ ఫోటోని షేర్ చేయడం మాతో సంతోషకరంగా ఉన్నదని తెలియజేశాడు. మీరు తిని లోకి ఎంట్రీ ఇవ్వాలని తమ అభిమాన కోరుకున్నట్లుగా తెలియజేశాడు నెటిజన్.

మరింత సమాచారం తెలుసుకోండి: