తాజాగా తమిళంలో మానాడు హిందీ సినిమా తెలుగులో "దిలూప్" పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఎస్ జే సూర్య ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను తెలియజేశాడు. సూర్య మాట్లాడుతూ తనకు సినిమాలు చేయడం అంటే ఎంతో ఇష్టమని, అందుకోసమే ఒకవైపు హోటల్లో పని చేస్తే.. మరొక పక్క సినిమాలలో నటించేందుకు అవకాశాల కోసం ప్రయత్నించే వాడిని తెలియజేశాడు.
కొన్ని మూవీస్ లో జూనియర్ ఆర్టిస్టు గా కూడా నటించాను. హీరోగా నటించాలని చాలా కోరికగా ఉండేది. కానీ నీ హీరో అవ్వాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందుచేతనే ముందుగా దర్శకుడీ గా సినిమాలను తెరకెక్కించి, డబ్బులు వచ్చిన తర్వాత నిర్మాతగా వ్యవహరించి ఆ తరువాత బాగా రావాలి అనుకున్నాను. అందు కోసం పది సంవత్సరాలు కష్టపడ్డాం అని చెప్పుకొచ్చాడు.
డైరెక్టర్ గా పవన్ తో ఖుషి, మహేష్ బాబు తో నాని వంటి సినిమాలను చేశాను. వీరిద్దరిని చాలా దగ్గరనుంచి చూశానని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకుంటే ఆ పని వెంటనే జరిగిపోవాలి, పవన్ ని దేవుడు చెక్కిన శిల్పంలా భావించాడు. ఇక మహేష్ బాబు ఏదైనా పని మనసుకు నచ్చిన ఇప్పటికీ ఆ పని చేయడానికి కాస్త ఆలోచించి సమయం తీసుకుంటారు అని చెప్పుకొచ్చాడు ఎస్ ఎస్. జే.సూర్య. వీరిద్దరి మధ్య నేను ఇది గమనించానని తెలియజేశారు.