సాధారణంగా ఒక్క సినిమా షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు..గణపతికి పూజ చేసుకుని..కొబ్బరకాయ కొట్టడం మన సాంప్రదాయం. ఇండస్ట్రీలో ఉండే ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో , హీరోయిన్ లు ఇలానే చేస్తారు. అలా పూజ కంప్లీట్ అయ్యాక..సినిమాకి సంబంధించిన హీరో, హీరోయిన్ల పై క్లాప్ కొట్టడానికి పలువురు స్టార్స్ ని పిలిచేవారు. ఇప్పటికి ఈ తంతూ ఇలానే కొనసాగుతుంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ నటించించిన ఓ సినిమాకి ఆయన కొడుకు బాలకృష్ణ క్లాప్ కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. పలువురు బడా స్టార్స్ ఉన్నా కూడా ఎన్టీఆర్ ఆయన కొడుకు చేత క్లాప్ కొట్టించడం పెద్ద హైలెట్ గా నిలిచింది.
1976 సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన " బంగారు మనిషి" అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పూజ కార్యక్రమాలకి బాలయ్య కూడా వెళ్లాడు. ఇక పూజా పనులు పూర్తి అయ్యాక తన తండ్రి సినిమాకి బాలకృష్ణ క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కి క్లాప్ కొడుతున్న బాలయ్య.. ఫోటోలో చాలా యవ్వనంగా కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు.