ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా బన్నీ స్పీచ్‌కు ఫిదా అవుతున్నాయి. బన్నీ పుష్ప సినిమాకు కచ్చితంగా తాము సపోర్ట్ చేస్తామని చెబుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గురించి జై పవర్ స్టార్ అనమంటే అనని.. బన్నీ ఈ రోజు జై బాలయ్య అనడంతో మెగా ఫ్యాన్స్ లో మరింత కోపం కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా డిసెంబర్ 17 న రిలీజ్ చేయాలని అనుకున్నారు.
అయితే ఇంతలోనే పుష్ప రిలీజ్ డేట్ ను అదే రోజు హడావిడిగా వేసేశారు. దీనిపై కూడా చిరంజీవి చాలా ఫీల్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక మెగాస్టార్ సైతం ఇప్పుడు తాను కూడా అదే రోజు పోటీగా ఆచార్యను రిలీజ్ చేస్తే ఏమౌతుంది... అందరం ఇబ్బంది పడటం తప్పు అని... తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఏదేమైనా బన్నీ సొంతంగా క్రియేట్ చేసుకుంటున్న ఓన్ ఇమేజ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో అయితే కలవరానికి కారణం అవుతోంది. మరి బన్నీ ఈ కోల్డ్ వార్ ను ఎలా ఎదుర్కొంటారో ? చూడాలి.