
అయితే ఆయన కొన్ని సంవత్సరాల ముందునుండే పలు అనారోగ్య సమస్యల కారణంగా తీవ్రం ఇబ్బంది పడ్డారట. ఆరేళ్ల క్రితం తొలుత ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడంతో సర్జరీ జరిగిందని అనంతరం హార్ట్ ప్రాబ్లెమ్ రావడంతో బైపాస్ సర్జరీ కూడా జరిగింది అని ఈయన ఒబేసిటీ పేషంట్ కూడా అని అక్కడి డాక్టర్లు గత అనారోగ్య కారణాలను వెల్లడించారు.
ఇలా ఆయన గత ఆరేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ...ఎన్నడూ ఆయన పెదవిపై చిరునవ్వు చెరగలేదు. ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలను భరిస్తూ నిన్న మొన్నటి వరకు సినీ పరిశ్రమకు తన సేవలను అందించారు.
సుదీర్ఘమైన తన సినీ కెరీర్ లో వివాదాలు లేని మంచి మనిషిగా కొనసాగాడు. ఇప్పటికీ ఆయన్ని తలుచుకుని కనులు మూసుకుంటే ఆయన చిరుమందహాసమే గుర్తొస్తుంది. అటువంటి మహాత్ముడు నేడు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. గాన గంధర్వుడు ఎస్. పి బాల సుబ్రమణ్యం మరణ వార్త నుండి ఇంకా బయటకు రాకముందే సిరివెన్నెల ఇక లేరనే మరో పిడుగు లాంటి వార్త తెలుగు ప్రజల గుండెలను నిలువునా కాల్చేస్తోంది.